గ్రామ వీధులకు మహర్దశ.. సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం
ప్రజల రాకపోకలకు మెరుగైన సౌకర్యాలు.. రూ.60 లక్షలతో అభివృద్ధి పనులు : సర్పంచ్ పెద్దమాముల యాకయ్య
నర్సింహులపేట, అక్టోబర్ 2 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలోని కొండ్రెడ్డి నారాయణరెడ్డి ఇంటి నుంచి గడ్డి యాకయ్య ఇంటి వరకు చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను గురువారం గ్రామ సర్పంచ్ పెద్దమాముల యాకయ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వీబీ జీ-రాంజీ, ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి సుమారు రూ.60 లక్షల వ్యయంతో గ్రామంలోని పలు వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడంతో పాటు, రాకపోకలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొబ్బ సోమిరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు జినుకల రమేష్, ఉప సర్పంచ్ కాస యాకయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘు, వార్డు సభ్యులు, శ్రీపాల్, కాంగ్రెస్ నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షుడు రేఖ అనిల్, బత్తుల రమేష్, సంపత్ రెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
