అర్హత కలిగిన వారందరూ ఓటు నమోదు చేసుకోండి
తహసిల్దార్ లూథర్ విల్సన్
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 28 (నమస్తే న్యూస్)
వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం శాసనమండలి ఓటరు జాబితా తయారీకి ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. 2026 నవంబర్ 1ను అర్హత తేదీగా నిర్ణయిస్తూ, అర్హులైన పట్టభద్రులు ఓటరు జాబితాలో తమ పేర్ల నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని తిరుమలాయపాలెం తహసిల్దార్ లూథర్ విల్సన్ పేర్కొన్నారు.
భారత పౌరుడై, సంబంధిత పట్టభద్రుల నియోజకవర్గంలో సాధారణ నివాసిగా ఉండి, 2026 నవంబర్ 1 నాటికి కనీసం మూడేళ్లకు ముందు యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా సమానమైన విద్యార్హత పొందిన వారు ఓటరుగా నమోదుకు అర్హులని అధికారులు తెలిపారు. ఇందుకోసం ఫారం-18ను 2026 నవంబర్ 6 (శుక్రవారం)లోపు సమర్పించాలి. దరఖాస్తులను సంబంధిత అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు/డిజిగ్నేటెడ్ అధికారుల వద్ద సమర్పించడంతో పాటు ఆన్లైన్లో కూడా దాఖలు చేసుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఉన్న ఓటరు జాబితాలో పేరు ఉన్న పట్టభద్రులు కూడా కొత్తగా నిర్ణీత ఫారంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. దరఖాస్తుతో డిగ్రీ/డిప్లొమా ధ్రువపత్రం ఒరిజినల్ లేదా నిబంధనల ప్రకారం ధృవీకరించిన ప్రతిని జత చేయాల్సి ఉంటుంది. సంబంధిత అధికారులు ఈ ప్రక్రియపై విస్తృత ప్రచారం నిర్వహించి అర్హులైన పట్టభద్రులందరూ నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆన్లైన్ దరఖాస్తుల కోసం: ceotelangana.nic.in
