50 కేజీల బియ్యం, ఆర్థిక సహాయం అందజేత.
కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పిన ప్రతినిధులు.
తిరుమలయపాలెం సెప్టెంబర్10
(నమస్తే న్యూస్ )
తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రఘునాథపాలెం మండలంలోని గురుకుల పాఠశాలలో గుండెపోటుతో మృతి చెందిన విద్యార్థి సాత్విక్ కుటుంబానికి అండగా నిలిచారు. బుధవారం గురుకుల పాఠశాలలో గుండెపోటుతో సాత్విక్ మృతి చెందిన విషయం తెలుసుకున్న అసోసియేషన్ ప్రతినిధులు కాకరవాయి గ్రామంలోని అతని కుటుంబాన్ని పరామర్శించారు. జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ సురభి మధు, జిల్లా జాయింట్ సెక్రెటరీ దండ లింగయ్య ఆధ్వర్యంలో సాత్విక్ కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. విద్యార్థిని చిన్న వయసులోనే కోల్పోవడం బాధాకరమని, ఈ విషాద సమయంలో కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో తమ వంతు సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ తరఫున సాత్విక్ కుటుంబానికి 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల కుటుంబాలకు ఏదైనా ఆపద ఎదురైనప్పుడు గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుంటి సురేష్, మండల ఉపాధ్యక్షులు బానోత్ ఉపేందర్, మండల ప్రధాన కార్యదర్శి వేల్పుల రాముల్లు, మండల జాయింట్ సెక్రెటరీ గంధసిరి వెంకటేశ్వర్లు, మండల ప్రధాన కార్యదర్శి అండెం శైలజ, కొత్తపల్లి వెంకన్న, సలిగంటి మల్లయ్య,సలిగంటి మల్సూర్,సలిగంటి సతీష్, సలిగంటి చిన్న మల్లయ్య, సలిగంటి సూరయ్య తదితరులు పాల్గొన్నారు.

