రిపోర్టర్: పిల్లల మల్లికార్జున్
సెంటర్: బయ్యారం
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని స్థానిక వే జెల్ల సైదులు రావు భవనంలో వీర వనిత చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం బి. వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మండ రాజన్న , మండల కార్యదర్శి నంబూరు మధు పాల్గొని మాట్లాడుతూ… భూమికోసం, భుక్తి కోసం ,. వేట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఆమె స్ఫూర్తినిచ్చిందని, నిజాం నవాబుకు ఆయన తొత్తులైన భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తన ఇల్లే కార్యాలయంగా మార్చిందని ,స్త్రీ జాతికి ఆదర్శనీయపాయంగా ఆమె జీవితమే నేటిమహిళ లోకానికి మార్గదర్శకమని, ఐలమ్మ పోరాటం స్ఫూర్తి , దేశ్ ముక్ ఎదిరించిన వీర మహిళా శక్తికి స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అంగిరేకుల నాగేశ్వరరావు, వ ల్లాల వెంకన్న, వెన్ను మోహన్, పానుగంటి రాము, రాయబారపు అప్పయ్య, గుర్రాన్ని రమేష్ ,ఆకుల రవి, గొర్ల సత్తిరెడ్డి ,కొల్లాపూర్ణ ,డి .పెంటయ్య, తదితరులు పాల్గొన్నారు…

