నర్సింహులపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
నర్సింహులపేట, ఆగస్టు 22 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పెద్దమాముల యాకయ్య శనివారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.అనంతరం సర్పంచ్ పెద్దమాముల యాకయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు రేషన్ సరకులు మరింత పారదర్శకంగా అందే అవకాశం ఉందన్నారు. కొత్త సాంకేతికతతో రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెరిగి, ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం అందించే సబ్సిడీ సరకులు సక్రమంగా చేరుతాయని తెలిపారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప కాస యాకయ్య, పంచాయతీ సెక్రటరీ అశోక్,గ్రామపంచాయతీ సిబ్బంది, అంగన్వాడి టీచర్స్, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


