పారిశుధ్యం, తాగునీరు, వీధిదీపాలపై ప్రత్యేక దృష్టి: సర్పంచ్ గుగులోత్ శాంతి
బయ్యారం, ఆగస్టు 22 (నమస్తే న్యూస్): బయ్యారం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఆదివారం జరగనున్న ఊరి ఇలవేల్పు ముత్యాలమ్మ జాతరను పురస్కరించుకుని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జాతర సందర్భంగా ముత్యాలమ్మ ఆలయాన్ని సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ శనివారం సందర్శించారు.ఆలయ పరిసరాలను పరిశీలించిన సర్పంచ్.. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుధ్య చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. రోడ్లకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తను పారిశుధ్య కార్మికులు తొలగిస్తున్న పనులను పరిశీలించారుభక్తుల సౌకర్యార్థం పారిశుధ్యం, వీధిదీపాలు, తాగునీటి వసతి వంటి కనీస అవసరాలను ముందుగానే పూర్తి చేయాలని గ్రామపంచాయతీ కార్యదర్శి రాంబాబు, సిబ్బందిని ఆదేశించారు. జాతర సమయంలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.సిబ్బంది పనితీరుపై సర్పంచ్ సంతృప్తి వ్యక్తం చేశారు. బయ్యారం ప్రజలకు ముత్యాలమ్మ జాతర శుభాకాంక్షలు తెలిపారు. ఊరి ఇలవేల్పు ముత్యాలమ్మ అమ్మవారి దీవెనలతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుగులోత్ కిషన్ నాయక్, ఉపసర్పంచ్ ఎనుగుల ఉమా రంజిత్, గ్రామపంచాయతీ కార్యదర్శి రాంబాబు, 10వ వార్డు సభ్యురాలు బట్టు ఉమాదేవి, మాజీ బయ్యారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తాటి జనార్దన్, పెద్దగౌడ్ బస్వ శ్రీనివాస్‌గౌడ్, బస్వ వెంకన్నగౌడ్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

