రిపోర్టర్: దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం ఆగస్టు 20 ( నమస్తే న్యూస్)
రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమ చేస్తున్న నిరుపేదలను పెట్టుబడుదారులు దోచుకు తింటున్నారని పెట్టుబాడుదారులకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు తప్ప వేరే మార్గం లేదని సిపిఐ (ఎంఎల్ )మాస్ లైన్ ( ప్రజాపంథా) పాలేరు డివిజన్ కార్యదర్శి బందెల వెంకయ్య అన్నారు.
తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సీనియర్ నాయకులు అఖిలభారత ప్రగశీల వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి రాయల చిరంజీవి సంతాప సభలో బందెల వెంకయ్య పాల్గొని మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం ఎందరో అమరుల త్యాగాలతో లక్షలాది ఎకరాల భూమిని పంచిపెట్టిన తెలంగాణ సాయుధ పోరాట గడ్డపై రాయల సుభాష్ చంద్రబోసు షేక్ చిన్న మలుసూర్. పెద్ద మన్సూర్. రామ నరసయ్య. దొరన్న. మాదాల నారాయణస్వామి. ఎల్లన్న. చంద్రశేఖర్. కాచన పల్లి అమరవీరుల త్యాగాల ఫలితమే ఈరోజు పేద ప్రజల కొంత విముక్తి కలిగిందని ఆయన అన్నారు. ఈ దేశంలో ఎలాంటి శ్రమ లేకుండా కోట్ల అధిపతి అవుతున్న పెట్టుబడుదారుల వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలేసినప్పుడే శ్రమజీవులకు కష్టజీవులకు విముక్తి కలుగుతుందని అన్నారు. రాయల చిరంజీవి తెలంగాణ ఉద్యమంలో వ్యవసాయ కార్మికుల వేతనాల కోసం ఉపాధి కూలీల హక్కులకై శక్తి వంచన లేకుండా పోరాడిన నాయకుడు మరణం వ్యవసాయ కూలీలకు పేద ప్రజల కు తీరంలోని అన్నారు. రాయిండ్ల చిరంజీవి సంతాప సభకు అరుణోదయ రాష్ట్ర నాయకుడు ఆరేంపుల వెంకన్న అధ్యక్షతన జరిగినది. చిరంజీవికి రెండు నిమిషాలు మౌనం పాటించి కుటుంబానికి సంతాపాన్ని సానుభూతి తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు కమ్మ కోమటి నాగేశ్వరరావు. ఏఐపీకేఎంఎస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు. మాస్ లైన్ తిరుమలయపాలెం మండల కార్యదర్శి సోమనపల్లి వెంకటేశ్వర్లు. డివిజన్ నాయకులు ఎడ్లపల్లి నవీన్. బానోతు శంకర్. రాయండ్ల చిరంజీవి కుమారుడు గురుమూర్తి. మాసు లైన్ మండల నాయకులు కత్తుల మల్లయ్య. కత్తుల నారాయణ. రాయిండ్ల ఆనందరావు. రాయిండ్ల సుధాకర్. వడ్లమూడి వెంకయ్య. వెంకటమ్మ. కేతమ్మ తదితరులు.


