ఆరేళ్లుగా పనిచేయని చేతి పంపుకు మరమ్మతులు
సర్పంచ్ మాలోత్ బాలు నాయక్ చొరవ
కేజీబీవీ వసతి గృహంలో నీటి సమస్యకు పరిష్కారం..
బాలికల వసతి గృహానికి ఊరట.. ఆరేళ్ల తర్వాత పనిచేసిన చేతి పంపు
నర్సింహులపేట,ఆగస్టు 20 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడుపుల గ్రామ చివారిలోని కేజీబీవీ బాలికల వసతి గృహంలో గత ఆరు సంవత్సరాలుగా పనిచేయకుండా ఉన్న చేతి పంపుకు ఎట్టకేలకు మరమ్మతులు చేశారు. గ్రామ సర్పంచ్ బాలు నాయక్ చొరవ తీసుకుని స్వయంగా దగ్గరుండి బోరింగ్ మెకానిక్ ఎర్ర నరసయ్యను పిలిపించి చేతి పంపును బాగు చేయించారు.ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్న చేతి పంపు మరమ్మతులు కావడంతో వసతి గృహంలోని బాలికలకు నీటి అవసరాల విషయంలో కొంత ఉపశమనం లభించనుంది. సమస్యను గుర్తించి వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టిన సర్పంచ్ బాలు నాయక్‌ను స్థానికులు, వసతి గృహ సిబ్బంది అభినందించారు.

