మునిపంపుల యూనియన్ బ్యాంకులో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలి.
గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం
యాదాద్రి/రామన్నపేట,జూలై 29(నమస్తే న్యూస్)
మునిపంపుల గ్రామపంచాయతీ పరిధిలోని యూనియన్ బ్యాంకు బ్రాంచ్‌లో వినియోగదారుల అవసరాల దృష్ట్యా పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులతో కలిసి బ్రాంచ్ మేనేజర్ శివకుమార్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం మాట్లాడుతూ, మునిపంపుల యూనియన్ బ్యాంకుకు ప్రతిరోజూ గ్రామంతో పాటు పరిసర గ్రామాల నుంచి వందలాది మంది వినియోగదారులు వస్తుంటారని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు మరియు చిన్నారులతో వచ్చే ఖాతాదారులు మరుగుదొడ్ల సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.బ్యాంకు వంటి ప్రజాసేవా సంస్థలో కనీస మౌలిక సదుపాయాలైన పబ్లిక్ టాయిలెట్స్ ఉండటం అత్యంత అవసరమని, వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బ్యాంకు యాజమాన్యం తక్షణమే స్పందించి పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు.వినతిపత్రాన్ని స్వీకరించిన బ్రాంచ్ మేనేజర్ శివకుమార్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి వేణు, ఉప సర్పంచ్ తాళ్ళ క్రాంతి కుమార్,పాలకవర్గం సభ్యులు యాదాసు లక్ష్మణ్ కుమార్,మేకల రాములు, మేకల జలందర్, కట్ట అరుణ్ కుమార్ గ్రామ ప్రజలు, బ్యాంకు వినియోగదారులు పాల్గొన్నారు.

