కలెక్టర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టియుడబ్ల్యూహెచ్143 నాయకులు.
మహబూబాబాద్,జూలై 22(నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ను టియుడబ్ల్యూహెచ్143 జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్ ను కలిసి బొకేలు ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో టిడబ్ల్యూహెచ్143 జిల్లా కన్వీనర్ మద్దినేని గుట్టయ్య యాదవ్, కో కన్వీనర్ గాడి పెళ్లి శేఖర్, గౌస్, శ్రీధర్, వెంకన్న, కిరణ్, ఫోటోగ్రాఫర్ వెంకటేశ్వర్లు, కరుణాకర్, సీతారాం నాయక్, శ్రీనివాస్, సురేష్ తదితరులు ఉన్నారు. ఇంకా జిల్లాలోని అధికారులు తాసిల్దారులు, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు, కార్యాలయం సిబ్బంది డి పి ఆర్ ఓ రాజేంద్రప్రసాద్ తదితరులు కలెక్టర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
