మృతునికి నివాళులర్పించిన గ్రంధాలయ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు.
డోర్నకల్/మరిపెడ(జూలై 20) నమస్తే న్యూస్:
మరిపెడ మండలం తండధర్మారం గ్రామానికి చెందిన లకావత్ రమేష్ నాయనమ్మ లకావత్ ద్వాలి(75)అనారోగ్యంతో నేడు స్వర్గస్తురాలైనారు. ఆమె మృతి వార్త తెలుసుకున్న మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు తండధర్మారం గ్రామానికి చేరుకుని లకావత్ ద్వాలి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గూగులోత్ వెంకన్న, గ్రామ సర్పంచ్ బాబు నాయక్,దిగజర్ల శీను, పానుగోతు వెంకన్న, బాలకృష్ణ తదితరులు వెంట ఉన్నారు. లకావత్ ద్వాలి మృతికి పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు సంతాపం తెలిపారు.

