Type Here to Get Search Results !

బిజెపి ప్రజా వ్యతిరేక పాలనపై సిపిఐ పోరు

NAMASTHE NEWS 0

బిజెపి ప్రజా వ్యతిరేక పాలనపై సిపిఐ పోరు.


బి.విజయసారిధి సిపిఐ జిల్లా కార్యదర్శి




కురవి,ఆగస్టు 5 (నమస్తే న్యూస్)

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా 6 నుండి14 వరకు సిపిఐ చేసే ప్రచార జాత ను జయప్రదం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి బి విజయ సారధి పిలుపునిచ్చారు.కురవి మండల కేంద్రం పార్టీ కార్యాలయంలో తురక రమేష్ అధ్యక్షతన జరిగిన డోర్నకల్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో విజయ సారధి మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా బిజెపి పాలనలో దేశం మన పెన్నడూ లేని విధంగా నిరుద్యోగిత పెరిగిందని నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నింటి సామాన్యుడికి పెను భారమైందని, మోదీ కార్పొరేట్ అనుకూల విధానాల వలన దేశ సంపద కేవలం గుప్పెడు మంది చేతిలో కేంద్రీకృతమై, చదిక శాతం ప్రజల దగ్గర కేవలం కొద్ది సంపద మాత్రమే ఉండడంతో ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరిగిపోయి ఆకలి, దారిద్రం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రూపాయి విలువ పతనం కావడo, విదేశి మార్గ ద్రవ్య నిల్వలు పడిపోతున్న ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్నామని గొప్పలు చెప్పుకోవడం మోడీకి ఆనవాయితీగా మారిందని విమర్శించారు.లక్షలాది మంది రైతులు సుదీర్ఘ పోరాటాలు చేసిన కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ కల్పించాలని డిమాండ్ పరిష్కారం కాలేదని, పేదలకు విద్యా, వైద్యం అందని ద్రాక్షగా మారిందని, సంఘటిత రంగ కార్మికులకు పని భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.పోరాటాలు, నిరసనలు, ఆందోళనలతోనే నియంతత్వ విధానాల అవలంబిస్తున్నా మోదీ ప్రభుత్వ మెడలు వంచడానికి ఈనెల 6 నుండి 14 వరకు జరిగే దేశవ్యాప్త ప్రచార జాతాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి, ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు నెల్లూరు నాగేశ్వరరావు మరిపెడ, డోర్నకల్ మండల కార్యదర్షులు మారగాని బాలకృష్ణ, తురక రమేష్ నాయకులు బుర్ర సమ్మయ్య బుడమ వెంకన్న దొంతు రామ్మూర్తి కన్నే వెంకన్న,బొల్లం ఉప్పలయ్య, నిలుగొండ నాగేశ్వరరావు రవి సూరి నర్సయ్య పాల్గొన్నారు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System