Type Here to Get Search Results !

ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతతోనే బహుజన రాజ్యం.

NAMASTHE NEWS 0

ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతతోనే  బహుజన రాజ్యం
బీఎస్పీ పాలేరు నియోజకవర్గం అధ్యక్షులు ఎన్నబోయిన రమేష్ 



తిరుమలాయపాలెం,జూలై 31 (నమస్తే న్యూస్ )

ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల ఐక్యతతోనే బహుజన రాజ్యం సిద్ధిస్తుందని బిఎస్పి కాలేజ్ నియోజకవర్గ అధ్యక్షులు ఎన్నబోయిన రమేష్ యాదవ్ పేర్కొన్నారు శుక్రవారం తిరుమలాయపాలెం  మండలం లోని దమ్మాయిగూడెం గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ పాలేరు అసెంబ్లీ కమిటీ అధ్యక్షులు ఎన్నబోయిన రమేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో దమ్మాయిగూడెం గ్రామానికి చెందిన షేక్ యాకూబ్ పాషా ను తిరుమలాయపాలెం బహుజన్ సమాజ్ పార్టీ మండల కమిటీ అధ్యక్షునిగా నియమించడం జరిగింది ఖమ్మం జిల్లా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు బుర్ర ఉపేందర్ సాహూ  ముఖ్య అతిథిగా పాల్గొని నిమక పత్రాన్ని అందించారు  తిరుమలాయపాలెం మండలంలో గ్రామ గ్రామాన పార్ట్ ని బలోపేతం చేయాలని సూచించడం జరిగింది, పాలేరు అసెంబ్లీ అధ్యక్షులు ఎన్నబోయిన రమేష్ యాదవ్ గారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతతో నే బహుజన రాజ్యం సిద్ధిస్తదని తద్వారా రాజ్యాధికారంలో బహుజను లకు అందరికి సమాన వాటా  లభిస్తుంది అని చెప్పడం జరిగింది నూతనంగా బాధ్యతలు స్వీకరించిన షేక్ యాకూబ్ పాషా గారు మాట్లాడుతూ నాకు ఇచ్చినటువంటి ఈ మండల అధ్యక్ష పదవికి పూర్తి న్యాయం చేస్తానని రాబోయే ఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీ గెలుపునకు కృషి చేస్తానని ఎస్సీ ఎస్టీ బీచి మైనారిటీ మరియు అగ్రవర్ణ పేదలను కలుపుకొని బహుజన రాజ్యం ఏర్పడే విధంగా నా వంతుగా శక్తి సామర్థ్యాలతో పనిచేస్తానని గ్రామ గ్రామాన గ్రామ కమిటీలు వేస్తానని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలేరు అసెంబ్లీ ఇన్చార్జి నలగట్టు శంకర్ మహారాజ్ గారు, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి మిరియాల నాగరాజు   పాలేరు అసెంబ్లీ అధ్యక్షులు ఎన్నబోయిన రమేష్ యాదవ్  మరియు తిరుమలాయపాలెం మండల అధ్యక్షులు షేక్ యాకూబ్ పాషా   తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System