- వర్షాకాలానికి ముందస్తు చర్యలు.
- విద్యుత్ సరఫరాకు ఆటంకాలు లేకుండా చెట్ల కొమ్మల తొలగింపు.
నర్సింహులపేట, జూన్ 7 (నమస్తే న్యూస్)వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రామంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయాలు తలెత్తకుండా మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట గ్రామ పంచాయతీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సర్పంచ్ పెదమాముల యాకయ్య ఆదేశాల మేరకు విద్యుత్ స్తంభాలు, తీగలకు అడ్డుగా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించే కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ సిబ్బంది శనివారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా బొడ్రాయి బజార్‌లోని వేముల రాంరెడ్డి నివాసం సమీపంలో, ఎస్సీ కాలనీలో బేతమల్ల రామచంద్రు, దూరు శివ, తీగల చంద్రమ్మ, బేతమల్ల రాంమూర్తి నివాసాల వద్ద, అలాగే తిరుపతమ్మ టెంపుల్ రోడ్డులో కొండ్రెడ్డి సోమిరెడ్డి నివాసం సమీప ప్రాంతాల్లో చెట్ల కొమ్మలను కత్తిరించి విద్యుత్ తీగలకు అడ్డంకులు తొలగించారు.వర్షాలు, ఈదురుగాలుల కారణంగా చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడటం వల్ల విద్యుత్ సరఫరా అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ పనులు చేపట్టినట్లు గ్రామ పంచాయతీ వర్గాలు తెలిపాయి.ఈ సందర్భంగా సర్పంచ్ పెదమాముల యాకయ్య మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడంతో పాటు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. అవసరమైన ప్రాంతాల్లో ఇలాంటి నిర్వహణ పనులను నిరంతరం చేపడతామని తెలిపారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సౌకర్యాల పరిరక్షణ కోసం గ్రామ పంచాయతీ కట్టుబడి పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.

