Type Here to Get Search Results !

విజయవంతంగా'99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక'సమావేశం.

విజయవంతంగా '99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక'సమావేశం.
ముఖ్య అతిధిగా పాల్గొన్న చైర్ పర్సన్ ప్రఘతి శ్రీపాల్ రెడ్డి.



డోర్నకల్/మరిపెడ,మే31(నమస్తే న్యూస్)ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మరిపెడ పురపాలక సంఘం ముందుకు సాగుతోంది.99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక మున్సిపల్ ఆడిటోరియంలో ప్రత్యేక సమావేశం అట్టహాసంగా జరిగింది.ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.గత 99 రోజుల్లో పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు,సంక్షేమ పథకాల అమలు,ప్రజా సమస్యల పరిష్కారంపై చైర్ పర్సన్ సమీక్షించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ ప్రఘతి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారీ ప్రతి పౌరుడికి పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

పారిశుధ్యం,తాగునీరు,రోడ్ల మరమ్మతులు,వీధి దీపాల నిర్వహణ వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మరిపెడను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.మహిళా నాయకత్వానికి పెద్దపీట వేస్తున్నామని మహిళా ప్రజాప్రతినిధులు,నాయకురాళ్లు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషమని,స్థానిక పాలనలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుండటం పట్ల చైర్ పర్సన్ హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విజయానంద్,కౌన్సిలర్లు నీలా లచ్చిరాం,బేబీ రవి,కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు పడిదం రాధిక వీరితో పాటు మున్సిపల్ సిబ్బంది,స్థానిక మహిళా సంఘాల ప్రతినిధులు,పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.ప్రజాపాలనపై ప్రజల్లో మరింత నమ్మకం పెరిగిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారని అన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.