మరిపెడ మున్సిపాలిటీలో అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలి.
-సీపీఐ జిల్లా నేత అబ్దుల్ రషీద్.
డోర్నకల్/మరిపెడ(జూన్ 17)నమస్తే న్యూస్.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న పలు ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డికి సీపీఐ జిల్లా సమితి సభ్యుడు ఎండి అబ్దుల్ రషీద్ వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా రషీద్ మాట్లాడుతూ పలు వార్డుల్లో చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదని,పారిశుద్ధ్య పనులు నిర్లక్ష్యంగా కొనసాగుతున్నాయని తెలిపారు.అనేక ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగకపోవడంతో ప్రజలు రాత్రివేళల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ముఖ్యంగా అంగడి ఆవరణ ప్రాంతం డంప్‌యార్డ్‌ను తలపించేలా చెత్త పేరుకుపోయిందని,అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి ఉండటంతో రోగులు,ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని అన్నారు.అంగడి ఆవరణలో వీధి దీపాలు కూడా పనిచేయడం లేదని తెలిపారు.
రామ్ విలాస్ రోడ్డు గుంతల మయమై ఉండడంతో చిన్నపాటి వర్షం పడిన వాహనధారులు,భాటసారులు ఇబ్బందులు ఎదురుకుంటున్నారని, పట్టణ కేంద్రంలో పట్టణంలో రామ విలాస్ బజారు బంగారం షాపులతో నిత్యం వేయిలమంది వస్తూ పోతు ఉంటారని,అలాంటి వ్యాపారాలు జరుగుతున్న రామ విలాస్ బజార్లో చినుకు పడితే చిత్తడిగా మారుతుందని స్థానిక వ్యాపారులు ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు.రామ విలాస్ బజారు పనులను సత్వరమే పూర్తి చేయాలని,అలాగే కొత్త తండ వెళ్లే రోడ్డు పనులను వేగవంతం చేయాలని,మున్సిపల్ పరిధిలోని తండాల్లో అపరిష్కృతంగా ఉన్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చెత్త సేకరణను క్రమబద్ధీకరించడం,పారిశుద్ధ్య పనులను మెరుగుపరచడం,వీధి దీపాలను మరమ్మతు చేయడం,అన్ని అపరిష్కృత అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను కోరారు.ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు...

